Header Banner

నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!

  Thu Jun 12, 2025 13:42        Politics

ఎన్డీయే కూటమికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. కూటమి పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ 'తల్లికి వందనం' (Thalliki vandanam) అమలు చేస్తున్నామని చెప్పారు. "సంపద సృష్టిస్తాం.. ఆదాయాన్ని పెంచుతామని ముందే చెప్పాం. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాం. 'తల్లికి వందనం' పథకం 67 లక్షల మంది విద్యార్థులకు వర్తింపజేస్తున్నాం. దీనికోసం రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుంది. గతంలో 'అమ్మఒడి'కి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నాం.

 

ఇది కూడా చదవండి: చంద్రబాబు మాట ఇచ్చి.. ఇల్లు కట్టించారు! తాము వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు..

 

అయితే అప్పట్లో ఒకరికి మాత్రమే ఇస్తే.. ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ 'తల్లికి వందనం' ఇస్తున్నాం. గత ప్రభుత్వం 42,61,965 మందికి ఇస్తే.. మేం 67,27,164 మందికి వర్తింపజేశాం. అప్పటితో పోలిస్తే అదనంగా 24,65,199 మందికి ఇస్తున్నాం. అప్పుడు రూ.5,540 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు రూ.8,745 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రూ.3,205 కోట్లు అదనంగా ఇస్తున్నాం. తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో జమచేస్తాం. అనాథలకు జిల్లా కలెక్టర్ నిర్ధారించిన ప్రకారం వారి ఖాతాల్లో వేస్తాం. తల్లికి వందనం జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతాం. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సరిదిద్ది సహాయం అందిస్తాం. దానికోసం జూన్ 26 వరకు ఫిర్యాదులు స్వీకరించి 30న తుది జాబితాను ప్రకటిస్తాం" అని చంద్రబాబు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

 

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Pressmeet #Thalliki Vandanam #APStudents